Parijatha Flowers: దేవదేవతలకు వివిధ రకాల పుష్పాలతో పూజ చేయడం వల్ల వారి అనుగ్రహం మనపై కలుగుతుందని మన భావించి ఎన్నో రకాల పుష్పాలతో పూజ చేస్తాము. ఇలా దేవుళ్లకు ఎంతో ఇష్టమైన పుష్పాలలో పారిజాత పుష్పాలు ఒకటి. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించడంతో విష్ణుమూర్తి ఈ వృక్షాన్ని స్వర్గానికి తీసుకువెళ్ళాడు అని తరువాత యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణడు ఈ వృక్షాన్ని భూమిపైకి తీసుకువచ్చారని చెబుతారు.ఇక భూమి పై ఉన్నటువంటి ఈ పారిజాత పుష్పాలతో స్వామివారికి పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని చెప్పవచ్చు.
మనం దేవుడికి పూజ చేసే సమయంలో చెట్టుపై ఉన్న పుష్పాలను కోసి దేవుడికి పూజ చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని భావిస్తాము. కానీ పారిజాత పుష్పాలను పొరపాటున కూడా చెట్టు పై నుంచి కోసి దేవుడికి పెట్టకూడదు. ఎప్పుడూ కూడా నేలరాలిన పుష్పాలను తీసుకుని దేవునికి సమర్పించాలి.అలా ఎందుకు చేయాలి అంటే పారిజాత వృక్షం స్వర్గ లోకం నుంచి భూ లోకంలోకి వచ్చింది కనుక ఆ చెట్టు నుంచి కోసిన పువ్వులు నేలను తాకినప్పుడు అవి పవిత్రమవుతాయి. అందుకే నేల పై రాలిన పుష్పాలను మాత్రమే స్వామికి సమర్పించాలి.
స్వర్గ లోకం నుంచి సాక్షాత్తు శ్రీ కృష్ణుడు భూమిపైకి పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చారు కనుక ఈ చెట్టును దైవ సమానంగా భావించి చెట్టు కింద ఆవుపేడతో అలికి ఉంచాలి. ఇలా భూమిపైకి రాలిన పుష్పాలను ఏరుకునే పూజ చేయాలి. అంతే కాకుండా ఇతరులు ఇచ్చిన పుష్పాలతో పూజ చేయటం వల్ల మనం చేసిన పుణ్య ఫలం మనకి కాకుండా ఎవరి దగ్గర అయితే మనం పువ్వులు తీసుకున్నామో వారికి దక్కుతుంది కనుక ఎవరితోను పువ్వులు తీసుకోకుండా పూజ చేయాలి.