వారంలో ఏరోజు ఏ దేవుడిని పూజించాలో తెలుసా.. పూజించే సమయంలో చెయ్యకూడదని తప్పులివే!

వారంలో ఏడు రోజులు ఉండగా ఒక్కో రోజు ఒక్కో దేవునికి ప్రీతిపాత్రమైనదని చెప్పవచ్చు. ఆయా రోజులలో దేవుడిని పూజించడం ద్వారా దేవుడి అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పవచ్చు. ఆదిత్యుడు అంటే సూర్యుడు కాగా ఆదివారం సూర్యుడిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదివారం సూర్యుడిని పూజిస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. తెల్లటి ధాన్యం సమర్పించి సూర్యుడిని పూజిస్తే మంచిది.

సోమవారం చంద్రునికి సంబంధించిన ప్రత్యేక దినం కాగా ఈరోజు శివుడికి కూడా ప్రత్యేకమైన రోజు కావడం గమనార్హం. శివుడికి మారేడు, బిల్వ పత్రాలతో పూజించడం వల్ల సిరి సంపదలు కలిగే అవకాశంతో పాటు మనం కోరుకున్నవి కోరుకున్న విధంగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సోమవారం లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన వారం కాగా ఈ రోజు పండితులకు లేదా బ్రాహ్మణులకు నెయ్యితో వండిన పదార్థాలను ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

ఆంజనేయ స్వామి, దుర్గామాతకు మంగళవారం ఇష్టమైన రోజు కాగా ఈ దేవతలను మంగళవారం పూజిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. మంగళవారం నాడు కాాళీ మాతను పూజించినా హనుమంతునికి తమలపాకులు లేదా వడ మాలను వేసి పూజించినా అనుకూల ఫలితాలు వస్తాయి. మినుము, కంది, పెసర పప్పులతో వేద పండితులకు భోజనం పెడితే మంచిది.

బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కాగా ఎర్రటి మందారాలతో బుధవారం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సమస్యలు తొలగిపోతాయి. బుధవారం విష్ణు దేవునికి నివేదించి పూజ చేస్తే దేవుని అనుగ్రహం కలుగుతుంది. వేంకటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, సాయిబాబాను గురువారం పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది.

శుక్రవారం దుర్గా, కాళీ, లలితా, కామాక్షీ, మీనాక్షీ వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది కాగా కలియుగ దైవం వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరమైన రోజుగా ఉంది.