మామూలుగా హిందువులు దేవుడికి నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే దీపారాధన చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలామంది తెలిసి తెలియక అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అయితే కొంత మంది వారాల్లో చేసుకుంటే మరికొంత మంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఏదైనా పెద్ద పూజ, వ్రతాలు లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పవిత్రమైన తేదీ, సమయం చూసుకుని చేస్తూంటారు. అయితే దేవుడికి పూజ చేసేటప్పుడు, నైవేద్యం సమర్పించేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు అంటున్నారు పండితులు.
చాలా మంది తెలిసో తెలియక పూజ చేసేటప్పుడు పలు రకాల తప్పులు చేస్తూ ఉంటారు. చాలా మందికి ప్రసాదాలు ఎప్పుడు సమర్పించాలో కూడా తెలీదు. ఇంట్లో దేవునికి ప్రసాదం నివేదించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడికి ప్రత్యేకంగా ప్రసాదం చేస్తున్నప్పుడు వంటగది గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి. అది కూడా సాత్విక ఆహారమై ఉండాలి. దేవుడినికి ప్రసాదం నివేదన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి.
ఒక్కసారి విడిచి పెట్టిన దుస్తులను అస్సలు ధరించకూడదు. అదే విధంగా దేవడికి ప్రసాదం పెట్టే పాత్ర కూడా చాలా ముఖ్యం. ఈ ప్రసాదం బంగారం, వెండి, రాగి, ఇత్తడి పాత్రల్లో మాత్రమే ప్రసాదాన్ని అందించాలి. అలాగే దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడే ఉంచకూడదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ప్రసాదం సమర్పించిన కొద్ది సేపటికి ప్రసాదాన్ని తీసి కుటుంబ సభ్యులు అందరికీ పంచి పెట్టాలి. దీని వల్ల సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలిసి వస్తాయని చెబుతారు.