దేవుని నైవేద్యం విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.. జీవితాంతం ఇబ్బందులు తప్పవంటూ?

మనలో చాలామంది దేవుడి విషయంలో భక్తిని కలిగి ఉంటారు. దేవుడికి ఎంతో భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అయితే దేవుడి నైవేద్యం విషయంలో కొన్ని తప్పులను మాత్రం అస్సలు చేయకూడదు. ఈ తప్పులు చేయడం వల్ల నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మన దేశ సంస్కృతిలో దేవుడిని పూజించడం అతి ముఖ్యమైనది.

దేవునికి నైవేద్యం సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. దేవుడిని పూజించడం ద్వారా భక్తులకు సంతోషంతో పాటు శ్రేయస్సు కలుగుతుంది. దేవుడి విగ్రహానికి సమర్పించిన నైవేద్యాన్ని కొంతమంది తీసుకోవడానికి ఇష్టపడతారు. మరి కొంతమంది మాత్రం ఆ నైవేద్యాన్ని అలాగే ఉంచుతారు. దేవుడికి నైవేద్యం పెట్టిన పదార్థాలను తీసుకోకూడదు.

దేవుడికి నైవేద్యం సమర్పించిన కొంత సమయం తర్వాత ఆ నైవేద్యాన్ని అక్కడినుంచి తీసివేయాలి. అలా చేయని పక్షంలో ప్రతికూల శక్తుల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నైవేద్యాన్ని దేవుని విగ్రహం ముందు రాగి, వెండి, బంగారం, రాయి, మట్టి లేదా చెక్క పాత్రలో ఉంచడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. భగవంతుడికి నివేదించిన నైవేద్యాన్ని ప్రసాదం రూపంలో మాత్రం తీసుకోవచ్చు.

దేవుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో పూజించే వాళ్లపై దేవుని అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది. పాడైపోయిన నైవేద్యాన్ని మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు.. పాడైపోయిన నైవేద్యం ఇంట్లో ఉంటే చెడు ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దేవుడిని  కొలిచే సమయంలో మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. అదే సమయంలో దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టినా నైవేద్యం వండే విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు.