నిన్న ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ రిజల్ట్స్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వటంతో ప్రస్తుతం ఆ విద్యార్థులు అంతా మీడియా ముందుకు తమ బాధను బయటికి కక్కుతున్నారు. ఎందుకు ఫెయిల్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పేరెంట్స్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రెండు రోజుల ముందు విడుదల చేస్తా అన్న రిజల్ట్ ను ఎందుకు ఆలస్యం చేశారు అంటూ.. ఎలాగైనా తమ పిల్లల్ని పాస్ చేసి తీరాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. కరోనా సమయంలో చదువు రాని వాళ్ళని కూడా పాస్ చేశారు అని ఇప్పుడు చదివే విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారు అని వాపోతున్నారు.