బలహీనపడిపోయిన సంగతిని పసిగట్టిన చంద్రబాబు నాయుడు భవిష్యత్ అవసరాల దృష్ట్యా తమకు కూడ ఒక ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఉంటే మంచిదని భావించి రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే రంగంలోకి దిగిన రాబిన్ శర్మ తన ఉత్తరాది బుర్రను తెలుగు జనాల మీద గట్టిగా వాడేస్తున్నారు. ఏపీలో ఇన్నాళ్లు కులాల ప్రాతిపదికన రాజకీయాలు నడిచాయి. ఈ కుల రాజకీయాలను అన్ని పార్టీలు చేశాయి. కానీ వాటిని ఎత్తుచూపించి ప్రత్యర్థిని భీకరంగా దెబ్బకొట్టిన ఘనత మాత్రం వైసీపీదే. చంద్రబాబు కేవలం ఒక కులాన్ని మాత్రమే పైకి తీసుకొస్తూ మిగతావారిని కుప్పకూలుస్తున్నారని వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అమరావతిని అందుకు అనుగుణంగా వాడుకున్నారు.
చంద్రబాబు కుల రాజకీయం చేస్తున్నారని జగన్ చేసిన వాదన జనాలకు బాగా ఎక్కింది. అందుకే తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడగొట్టారు. ఇప్పుడు రాబిన్ శర్మ సైతం ఇదే ఫార్ములాను తీసుకున్నారు. అయితే కులం స్థానంలో మతాన్ని చేర్చారు. జగన్ ఎలాగూ క్రైస్తవ మాట విశ్వాసి కాబట్టి సులభంగానే మత రాజకీయం చేయవచ్చని అనుకున్నారు. వారికి మరింత వెసులుబాటును కల్పిస్తూ ఆలయాల మీద వారు దాడులు జరిగాయి. అసలే అవకాశం కోసం కాచుకుని కూర్చుని ఉన్న బీజేపీ దాడులు జరిగిన మరుక్షణమే జగన్ క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి హిందూ మతం మీ దాడి చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. దీంతో అలర్ట్ అయిన రాబిన్ శర్మ చంద్రబాబును కూడ హిందూత్వం ఎజెండాను భుజానికెత్తుకోమని సలహా ఇచ్చారు.
ఆయన సలహా మేరకే చంద్రబాబు ఎన్నాడోలేని విధంగా మతం గురించి మాట్లాడుతున్నారు. జగన్ హిందూ మత విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నడూలేని విధంగా చంద్రబాబు మతం మాట ఎత్తేసరికి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరైతే ఆయన మాటలను బలపరిచారు. బీజేపీ ఇదే మాటలను చెబితే వారి తత్వమే అది కాబట్టి లైట్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు మాటలు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పుడు రాబిన్ శర్మ టార్గెట్ మొత్తం పంచాయతీ ఎన్నికలే. కులం స్థానంలో మతాన్ని జొప్పించాలని చూస్తున్నారు. టీడీపీ మద్దతుదారులంటే హిందూత్వ రక్షకులన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. మరి ఆయన వేసిన ఉత్తరాది స్ట్రాటజీకి ఏపీ జనం ఎఫెక్ట్ అవుతున్నారా లేకపోతే తిప్పికొడుతున్నారా అనేది పంచాయతీ ఫలితాల్లో తేలిపోయింది.