తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించటంతో వచ్చే ఏడాది జనవరి లోపు అక్కడ ఎన్నికల జరగాలి. నిజానికి అది వైసీపీ సిట్టింగ్ స్థానం , కాబట్టి ఎలాగైనా తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ పావులు కదుపుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోతే వాళ్ళ స్థానంలో కుటుంబ సభ్యులను నిలబెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరుగుతుంది.
గతంలో నంద్యాల్లో టీడీపీ నేత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు అయన కొడుకు బ్రహ్మానంద రెడ్డి పోటీ చేసాడు, అతనికి పోటీగా వైసీపీ తమ అబ్యర్దిని దించి పాత సంప్రదాయానికి చరమగీతం పడింది. కాబట్టి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ కూడా అబ్యర్దిని పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ విషయమే ఇప్పుడు వైసీపీ కి ఇబ్బంది కలిగిస్తుంది. అయితే అది sc రిజర్వేషన్ సీటు కాబట్టి సరైన కాండిడేట్ టీడీపీ కి దొరకటం లేదు. గతంలో టీడీపీ నుండి పోటీచేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం టీడీపీ కి దూరంగా ఉంటుంది. 2019 ఎన్నికల ఆమె పార్టీకి సంబదించిన విషయాల్లో పెద్దగా కనిపించటం లేదు. అదే సమయంలో బీజేపీ కి దగ్గర అవుతుంది.
గతంలో తనతో కలిసి కేంద్రంలో పనిచేసి, ప్రస్తుతం బీజేపీ లో జాతీయ స్థాయి నాయకురాలైన పురంధేశ్వరి సాయంతో ఆమె బీజేపీ లో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెను తిరుపతి నుండి పోటీలో దించాలని బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనితో టీడీపీకి సరైన కాండిడేట్ లేకుండా పోయింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ స్వర్గీయ శివ ప్రసాద్ కుటుంబం నుండి ఎవరినైనా పోటీలో దించాలనే ఆలోచనలు టీడీపీ అధినేత ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే వర్ల రామయ్య కూడా తిరుపతి నుండి పోటీచేయాలని కోరికతో ఉన్నట్లు సమాచారం. ఇరు పార్టీలు కూడా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోని ఇప్పటి నుండే సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో ఎలాగైనా విజయం సాధించి వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అందుకే ఇదే నిదర్శనమని నిరూపించాలని టీడీపీ పట్టుదలతో వుంది. ఎట్టిపరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకొని తమ పాలనా మీద ప్రజలు నమ్మకంతోనే వున్నారని నిరూపించాలని వైసీపీ చూస్తుంది