పాక్ దారుణ కుట్ర : భారత్ సరిహద్దులో సొరంగం..!

పాకిస్తాన్ కు తనపై కంటే కూడా భారత్ పైనే ఎక్కువ ధ్యాస. తమ అభివృద్ధిని పట్టించుకోని పాక్ భారత్ నాశనాన్ని మాత్రం అనుక్షణం కోరుకుంటుంది. భారత్ పాక్ ను ఎన్నిసార్లు తిప్పికొట్టినా కూడా పాక్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. అయితే తాజాగా పాకిస్తాన్ ఇండియాపై చేస్తున్న మరో కుట్ర బయటపడింది. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉన్న భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరో ఉగ్ర కుట్రను బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు బయటపెట్టాయి.

pakistan tries to enter in india
pakistan tries to enter in india

ఆ సరిహద్దును ఆనుకుని ఓ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించాయి. ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సరిహద్దు కంచె నుంచి భారత్ వైపు దాదాపు 50మీ. పొడవుతో ఆ సొరంగం ఉన్నట్లు బీఎస్ఎఫ్ గురువారం గుర్తించింది. ఆ సొరంగ ప్రవేశం దాదాపు 25మీ…లోతు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి కేవలం 400మీ. దూరంలో పాకిస్తాన్ బోర్డర్ పోస్ట్ ఉన్నట్లు చెప్పారు. సొరంగం వెలుగుచూడటంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరిన్ని సొరంగాలు ఉండే అవకాశం ఉందా అన్న అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దు వెంబడి ‘మెగా-యాంటీ టన్నెల్’ తనిఖీలను నిర్వహిస్తున్నాయి. ఈ ఘటన వల్ల సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.సరిహద్దు వెంబడి సొరంగాలను గుర్తించేందుకు రాడార్స్ ను కూడా ఉపయోగించాలని భావిస్తున్నారు. తద్వారా ఉగ్ర చొరబాట్లకు చెక్ పెట్టవచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే పంజాబ్లోని సరిహద్దు గుండా భారత్ లోకి చొరబడిన ఐదుగురిని బీఎస్ ఎఫ్ బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.