Viral Video: ప్ర‌యాణికుడిని కాలితో త‌న్నిన పోలీసు.. వీడియో వైర‌ల్

Viral Video: రైలులో ఓ ప్రయాణికుడిని కాలితో త‌న్నాడు ఓ పోలీసు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో అధికారులు దీనిపై స్పందించి ఆ పోలీసుపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే…

కేరళ రాజధాని తిరువనంతపురం వెళుతున్న మావేలీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటుచేసుకుంది. స్లీపర్‌ క్లాస్‌ బోగీలో తలుపు వద్ద నేలపై కూర్చున్న టికెట్‌ లేని ప్రయాణికుడిని ఏఎస్‌ఐ ఎంపీ ప్రమోద్‌ చూశారు. ఈ విష‌యాన్ని గుర్తించిన ఓ కానిస్టేబుల్ ఆ ప్ర‌యాణికుడిపై దాడికి దిగాడు. ప్రయాణికుడు మ‌ద్యం తాగి ఉన్నాడ‌ని ఆ కానిస్టేబుల్ భావించాడు. అత‌డి ప‌క్కటెముక‌ల‌పై కానిస్టేబుల్ కాలితో పదేపదే తన్నారు. అనంతరం వడకరా స్టేషన్‌లో ప్రయాణికుడిని రైలు నుంచి గెంటేశారు.దీంతో ఆ ప్ర‌యాణికుడు కింద‌ప‌డిపోయాడు.

అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు ఆ బాగోతాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అయితే ఆ దశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో పోలీసు ఉన్నతాధికారులు ఏఎస్‌ఐ ఎంపీ ప్రమోద్‌ కి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వెంటనే ప్రమోద్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆ తర్వాత పోలీసు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేయడంతోపాటు, నివేదిక సమర్పించాలని కన్నూరు పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.

YouTube video player