ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ధర ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. దీంతో చాలామంది ప్రజలు ఆయిల్ వాడుకను బాగా కంట్రోల్ లో ఉంచారు. కానీ అంతలోనే ఒక ప్రాంతానికి చెందిన ప్రజలకు ఏకంగా ట్యాంకర్ ఆయిల్ దొరికింది. ఇంతకు అసలేం జరిగిందంటే.. ముంబై- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పాల్గరు జిల్లా లో తవా గ్రామ సమీపంలో 12 వేల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.
దీంతో సూరత్ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా.. ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు ఆ వంటనూనె కోసం తెగబడ్డారు. బిందెను, క్యాన్లలో వంటనూనె నింపుకోవడానికి బాగా పోటీ పడ్డారు. ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఆ ఘటన స్థలాన్ని పరిశీలించారు.