హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించండిలా !

Overcome Hair Fall Problems

ఈ కాలంలో ఆడ మగ తేడా లేకుండా అందరు జుట్టు రాలడం మరియు జుట్టు పలచబడటమనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 21 సంవత్సరాలు నిండకుండానే 25 శాతం యువకులకు హెయిర్ లాస్ ప్రాబ్లం మొదలవుతుంది. ఏదొక వయస్సులో 45 శాతం మంది ఆడవారికి జుట్టు పలుచబడటం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో … ఎలా ఈ సమస్యల నుండి బయటపడాలో తెలుసుకుందాం.

Overcome Hair Fall Problems

 

ప్రతి రోజూ వేడి నీటితో తల స్నానం చేయటం, డ్రయర్లు, స్ట్రైట్నర్లు వాడటం, ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల హెయిర్ కి డ్యామేజ్ జరుగుతుందని నిర్ధారణ అయ్యింది. షాంపూలో సల్ఫేట్ లేదా మరింకేదైనా హానికారక రసాయనాలు ఉంటే హెయిర్ లాస్ ప్రాబ్లంని కొని తెచ్చుకున్నట్లే. అలానే జుట్టుకు వాడే నూనె విషయంలో కూడా జాగ్రత్త తీసుకుని కొనేముందు పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి.

ఎక్కువగా హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతున్నట్లయితే రాత్రి వేళ పడుకునే ముందు మరిచిపోకుండా జుట్టుని శుభ్రంగా కడుక్కోండి. తడిగా ఉన్న జుట్టుని ఎక్కువ ప్రెజర్ తో తుడవకూడదు, అలానే ఎక్కువగా దువ్వినా కూడా తప్పు చేసినట్లేనని గుర్తించుకోండి. జుట్టుని గట్టిగా కట్టుకుంటే పలుచబడే సమస్యను ఎదుర్కుంటారు. జుట్టు రాలటానికి ముఖ్యంగా వత్తిడి ఒక ప్రధానకారణమని వైద్యులు గుర్తించారు.

శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ రక్తం ద్వారానే సరఫరా అవుతాయి. మంచి ఆహారం తీసుకున్నప్పటికీ ఆ పోషకాలు అందితేనే జుట్టు మంచిగా పెరుగుతుంది. వారంలో కనీసం ఒకసారైనా హెడ్ మసాజ్ చేసుకుంటే తల మాడు ప్రాంతంలోని నరాలలో రక్త సరఫరా బాగా జరిగి జుట్టు రాలకుండా వత్తుగా పెరుగుతుంది. పడుకునేముందు నూనెతో మసాజ్ చేసుకుని ఉదయం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హెయిర్ లాస్ సమస్యని అధిగామించటానికి వ్యాయామం ఒక చక్కని పరిష్కారం. ఒక అరగంట పాటు వాకింగ్, రన్నింగ్ చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలానే యోగాసనాలు కూడా బాగా పనిచేస్తాయి. ఖాళీ సమయంలో ‘బాలయం’ ప్రయత్నిస్తే రక్త సరఫరా బాగా జరిగి జుట్టు రాలటం తగ్గుతుంది.

ప్రస్తుత జీవన పరిస్థితుల్లో ముఖ్యంగా ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ , ప్యాకేజ్డ్, ఫ్రైడ్, కూల్ డ్రింక్స్ వంటివి అతిగా తీసుకోవటం ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి హానికరమైన పదార్థాలకు దూరంగా ఉంటే జుట్టు రాలడాన్ని తగ్గించుకోటమేకాక అనేక ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా కాపాడుకోవచ్చు.