ORR: ఓఆర్ఆర్ పై నెటి నుంచి టోల్ ఛార్జీల పెంపు!

ORR: తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు పై టోల్ ఛార్జీలు పెరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ రోజు నుంచే ఛార్జీలు అమలులోకి రానున్నాయి. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ దాదాపు 150 కిలోమీటర్ల పరిధిలో ఉండటమే కాకుండా.. అక్కడ ప్రయాణించడానికి టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధించిన వాహనాల పరంగా ప్రతి కిలో మీటర్ కు రూ.2 నుంచి రూ.13 వరకు పెంపొందించారు. ఈ వసూళ్లను హెచ్ఎండిఏ పెంపొందించగా.. వీటిని ఈగల్ అనే ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది. ప్రతి 18 నెలలకు రూ.630 కోట్లకు ఈగల్ సంస్థ కోట్ చేసింది. ఇక మొత్తం 19 ఇంటర్ చేంజ్ ల వద్ద ఈరోజు నుంచి టోల్ వసూలు చేస్తున్నట్లు అర్థమవుతుంది.