Anupama Parameswaran: డబ్బు కోసం ఇంత దిగజారాలా..అనుపమ పరమేశ్వరన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు!

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకాదరణ పొందినప్పటికీ ఈమెకి గత కొంత కాలం నుంచి ఎలాంటి హిట్స్ లేక సతమతమవుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా అనుపమ పరమేశ్వరన్ మరొకసారి ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఇలా రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ దారుణంగా నెటిజన్ల ఆగ్రహానికి బలైంది.

ఈ క్రమంలోనే దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా,అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ఇప్పటికే ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాలలో నటించినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ సన్నివేశాలు ట్రైలర్ లో చూపించడంతో నెటిజన్లు సదరు హీరోయిన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ డబ్బు కోసం ఇంత దిగజారాలా అంటూ ఈమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా లిప్ లాక్ సన్నివేశాలలో నటించడానికి కూడా ఒక స్థాయి ఉండాలి.. ఎంత బడా నిర్మాత కొడుకు అయితే మాత్రం డబ్బుకు ఆశపడి ఇలా చేయడం ఏంటి? అంటూ నెటిజన్లు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉంటే వాటికి హీరోయిన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కానీ కొంత మంది హీరోయిన్లకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఈ సన్నివేశాల్లో నటించేలా చేస్తుండటం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ కూడా లిప్ లాక్ సన్నివేశాలలో నటించడానికి భారీ రెమ్యునరేషన్ తీసుకుని ఉంటుందని మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.