Hyderabad: ఓఆర్ఆర్‌పై లారీని ఢీకొన్న కారు .. ఘటనలో ఎస్ఐ దుర్మరణం

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్‌పై లారీని కారు ఢీకొట్టడంతో ఎస్ఐ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో జరిగింది. లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఎస్‌ఐ పల్లె రాఘవేందర్‌ గౌడ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జీఆర్పీలో రాఘవేందర్‌ ఎస్ఐగా పని చేస్తున్నారు. రాఘవేందర్‌గౌడ్‌ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌ జీఆర్‌పీలో ఎస్‌ఐగా పని చేసిన ఆయన ఇటీవల మహబూబ్‌నగర్‌కు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి 2.15 సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన  పహాడి షరీఫ్ పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు