నెట్టింట్లో గ్లామర్ దుకాణం పెట్టిన పవన్ హీరోయిన్

Anu Emmanuel

Anu Emmanuel

నాని ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. మంచి గ్లామర్ ఉండటంతో త్వరగానే ఆమెకు పెద్ద ఆఫర్లు వచ్చాయి. వరుసగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కింది ఆమెకు. కానీ ఆ సినిమాలు ఫ్లాప్స్ కావడంతో అను ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆతర్వాత చేసిన మీడియా రేంజ్ సినిమాలు కూడ బోల్తా కొట్టడంతో అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఆమెకు ఒక సినిమా రావడమే అతికష్టం మీద వస్తోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే ‘మహాసముద్రం’. ఇలా కెరీర్ ఒక్కసారిగా డల్ అయిపోవడంతో అను ఆలోచనలో పడింది. అందుకే కొత్త ట్రిక్ ప్లే చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. తరచూ ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ గ్లామరస్ ఫోటోలను సామజిక మాధ్యమాల్లో వదులుతోంది. ఆ ఫోటోల్లో హాట్ హాట్ గా కనిపిస్తూ హీటెక్కిస్తోంది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఇంత అందగత్తెకు అసలు ఆఫర్లే లేవేంటి, పెద్ద హీరోలు తమ సినిమాల్లో ఈమెను తీసుకోవచ్చు కదా.. మంచి గ్లామర్ అప్పీల్ ఉంటుంది అంటున్నారు. అను పాయింట్ కూడ ఇదే. తన గ్లామర్ చూసైనా కొత్త ఆఫర్లు, పెద్ద ఆఫర్లు వస్తాయేమోనని. చూడాలి మరి ఆమె ప్లన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో.