Ram charan Heroine: సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన రామ్ చరణ్ హీరోయిన్.. నెట్టింట ఫోటోస్ వైరల్!

Ram charan Heroine: రామ్ చరణ్ కెరియర్ లో మరిచిపోలేని సినిమాలలో ఆరెంజ్ సినిమా కూడా ఒకటి. ఎందుకంటే ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా నిలిచి నిర్మాత నాగబాబుకు బోలెడన్ని నష్టాలను మిగిల్చింది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జెనీలియా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. మరో హీరోయిన్‌ గా షాజన్ పదమ్సీ చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన మసాలా మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్‌ కి షిఫ్ట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రముఖ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా ఒక ఫ్రెండ్ ద్వారా షాజన్‌ కి పరిచయం ఏర్పడిందట. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారట. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసిన ఈ జంట తాజాగా ఎలాంటి హంగామా లేకుండా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు.

గత రెండు మూడు రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదమ్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలని తన్ ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి ఫోటోలను చూసిన అభిమానులు నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.