వామ్మో.. ఒక ప్లాస్టిక్ నీళ్ళ బకెట్ ధర రూ.33,691అట.. ఇంతకీ ఎక్కడో తెలుసా?

మామూలుగా ఒక బకెట్ ధర ఎంత ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ ఓ చోట బకెట్ ధర వేలల్లో ఉండటంతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకు అది ఎక్కడంటే.. పెద్ద ఆన్లైన్ షాపింగ్ సర్వీస్ అమెజాన్ లో. అయితే ఈ అమెజాన్ లో బీవైమాల్ ప్లాస్టిక్ బకెట్ ఎమ్మార్పీ రూ.33,691.84 ఉండగా.. దానికి 38 శాతం తగ్గించి రూ.21,057 కు ఎమ్మార్పీ ఇచ్చారు.

మరి ఇలా ధర పెట్టడానికి రెండు కారణాలతో ఉండొచ్చు. ఒకటి సాంకేతిక లోపం వల్ల ధర ఇలా ఇవ్వొచ్చు.. లేదా సాంకేతిక లోటుపాట్లను సొమ్ము చేసుకునేందుకు అమెజాన్ వాళ్ళు ఇలా అధిక ధర పెట్టవచ్చు. మార్కెట్ ధరకే మరో పేరుతో విక్రయానికి ప్లాస్టిక్ నీళ్ళ బకెట్ పెట్టి ఉండొచ్చు. మొత్తానికి ఈ ధరతో జనాలంతా షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం బకెట్ ధర కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.