Nihaarika: మెగా డాటర్ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మెగా కుటుంబం అనగానే బంధాలు, అనుబంధాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అన్న పిల్లలు, తమ్ముడి పిల్లలు అనే తేడా వారి కుటుంబంలో ఎక్కడా కనిపించదు. అందరూ సమానంగానే ఉంటారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ ప్రాణమే. ఆయన కూడా పిల్లలందర్నీ ఒకేలా చూస్తారు. తన పిల్లలతో పాటు తన తమ్ముళ్ల పిల్లలు, చెల్లెల్ల పిల్లలను కూడా ఒకేలా ట్రీట్ చేస్తారు చిరంజీవి. అందుకే అందరికీ ఆయనంటే కుటుంబంలోని వారందరికీ ఎంతో ఇష్టం. చిరంజీవి పేరు చెప్పుకొని ఆయన కుటుంబంలో ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి వస్తున్నారు. రామ్ చరణ్, సుస్మితతో సమానంగా తమ్ముడి, చెల్లెల పిల్లల్ని కూడా అదేవిధంగా చూస్తారు. తన చిన్ననాటి నుంచీ కూడా పిల్లలతో ఆడుకోవడం హాబీ అని కూడా చిరంజీవి చాలా సార్లు చెప్పారు.
అలాంటి కుటుంబంలో గత యేడాది జరిగిన నాగబాబు కూతురు నిహారిక వివాహం జరగడంతో వారి కుటుంబమంతా కూడా అంతే సందడితో కనిపించారు. అల్లారు ముద్దుగా పెంచిన నిహారిక వివాహం గత సంవత్సరం డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఇకపోతే నిహారిక వివాహానికి మెగా కుటుంబానికి చాలా విలువైన నగలు వచ్చాయి. వరుణ్ తేజ్ కూడా చెల్లిలి కోసం భారీగానే గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక చిరంజీవి ఏం గిఫ్ట్ ఇచ్చారనే వార్తలు సంచలనంగా మారాయి. డాడీ అని ముద్దుగా పిలుచుకునే తన పాపాయికి ఓ ఖరీదైన బహుమతిని డైమండ్ నగిషీతో తయారు చేయించారట. ఆమె కోసం ప్రత్యేకంగా కోటిన్నర విలువైన నగలు చేయించినట్లు సమాచారం. గిఫ్ట్‌ను పెళ్లికి ముందే ఆయన భార్య సురేఖతో ఇప్పించారని సమాచారం. ఇక కూతురుకే కాదు అల్లుడు చైతన్యకు కూడా భారీగానే బహుమతులు అందజేశారట. ఫ్యూచర్‌లో చైతన్య కూడా సినిమాల్లోకి వస్తే చిరంజీవి పేరు ఉపయోగపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.