Bhalakrishana:!ప్రముఖ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూనే ఉంటుంది. స్టేజ్‌పైన ఆయన మాటలు, అభిమానులపై చెంప దెబ్బలు, భారీ డైలాగ్‌లు ఇలా ఆయనకు సంబంధించిన ఎలాంటి వార్త అయినా నెట్టింట్లో చెక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇక ఆయన వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడానికి కూడా ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు చెందిన ఓ వార్త ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళితే సినిమా సినిమాకు హెయిర్ స్టైల్ మార్చే బాలయ్య, విగ్గు వాడతారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక బయట కూడా చాలా సార్లు ఆయన విగ్గుతోనే దర్శనమివ్వడం చూస్తూనే ఉంటాం. అలాంటి బాలయ్య విగ్గు ధర లక్షల్లో ఉంటుందని సమాచారం. ఇకపోతే ఆయన పెట్టుకునే విగ్గు ధర అక్షరాలా 2 లక్షల రూపాయలట. మిగతా హీరోలతో పోలిస్తే బాలయ్య ధరించే విగ్గు కొంచెం ఢిపరెంట్. అందుకే దాని ధర ఎక్కువ అని అంటున్నారు.
అయితే ఇలాంటి విగ్గులు బాలయ్య దగ్గర ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఉంటాయని, ఏ సినిమాకు ఏది సూటవుతుందో చూసి అది ధరిస్తాడట. వాటిని తయారు చేయడానికి కూడా ప్రత్యేకించి కొందరు ఉంటారట. అంతే కాకుండా ఆయన కేవలం విగ్గుల కోసమే ఏకంగా 20 లక్షలు ఖర్చు చేస్తాడని, టాలీవుడ్‌లో ఏ హీరో కూడా విగ్గుల కోసం ఈ రేంజ్‌లో ఖర్చు చేయరని ఫిల్మ్‌నగర్‌లో టాక్. ఇక ఈ విగ్గులు మాత్రమే కాదు ఆయన వాడే కార్లు, వాచ్‌లు లాంటి వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవేనట. అందుకే ఆఫ్‌స్క్రీన్‌లోనూ బాలయ్య అదరగొడతారు.