Ranbir – Alia: బాలీవుడ్ ప్రేమపక్షులు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ లు గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా ఏప్రిల్ 14న మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు బాయ్ బాయ్ చెబుతూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. బాలీవుడ్ లో వీరిద్దరూ స్టార్ హీరో హీరోయిన్ అన్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి అభిమానులు ఈ జంట ఎప్పుడెప్పుడు ఒకటి అవుతుందా అని ఎప్పటినుంచో ఎంతగానో ఎదురుచూశారు. మొత్తానికి అభిమానులు ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది.
ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ జంట పెళ్లి గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పెళ్లిలో ఆలియా భట్ ధరించిన ఉంగరం, మంగళ సూత్రం ఖరీదు గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ రెండింటి ద్వారా దాదాపుగా కోటి రూపాయల వరకూ ఉండవచ్చు అని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక వీరి రిసెప్షన్ ఏప్రిల్ 17వ తేదీన గ్రాండ్ గా జరగనుంది అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఈ ఇద్దరూ ఓకే చెప్పిన ప్రాజెక్టులను కంప్లీట్ చేయబోతున్నారు అని తెలుస్తోంది.
అలియా భట్ కూడా పెళ్లి తర్వాత నటిగా కెరీర్ ను కొనసాగించడం ఉందట. అయితే ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ తెరకెక్కబోతున్న సినిమాకు అలియా భట్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినప్పటికీ ఆమె జెడ్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల దాదాపుగా ఆమె ఈ సినిమాలో నటించకపోతే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి అయిన సందర్భంగా ఈ జంట సినీ ప్రముఖులకు ఈ వీకెండ్ లో పార్టీ కూడా ఇవ్వబోతున్నారు అని సమాచారం. మొత్తానికి ఈ ప్రేమ పక్షులు పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.