TV Celebrities: బుల్లితెర నటీమణులు వాడే కార్ల ఖరీదు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

TV Celebrities: మన తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న సీరియల్ హీరోయిన్స్ మరియు ఆర్టిస్ట్‌లు ఎంతో విలువైన కార్లను ఉపయోగిస్తూ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా వీరు కూడా ఎంతో ఖరీదైనసెలబ్రిటీలకు ఏమాత్రం చేసుకోకుండా వీరు కూడా ఎంతో ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటారు. బుల్లితెర సెలబ్రిటీలు ఎలాంటి కార్లు వాడుతారో, ఎంత ఖరీదైనవి వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక వివరాల్లోకి వెళితే సీరియల్ యాక్టర్ హరితేజ వాడే కారు వోల్వో కంపెనీకి చెందినది. దాని విలువ దాదాపు 41 నుంచి 88 లక్షలు వరకు ఉంటుంది. అంతే కాకుండా సమీరా వాడే కారు ధర 20 నుంచి 30 లక్షలు ఉంటుందని అంచనా.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందిన, పొందుతున్న మెగా సీరియల్ కార్తీక దీపంలో వంటలక్కగా నటించిన ప్రేమీ విశ్వనాథ్‌ కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. ఆమె కూడా తనకు తగ్గ రేంజ్‌లో ఖరీదైన కారును ఉపయోగిస్తున్నారు. దాని ధర విషయానికొస్తే 40 లక్షలకు తగ్గకుండా ఉందట. అంత పాపులారిటీ కలిగిన ఆమె అంత రేంజ్‌లో కారు వాడడం నమ్మదగిన విషయమే కదా.

ఇక అదే జోరుతో సీరియల్స్‌తో దూసుకుపోతున్న జానకి కలగనలేదు ఫేమ్ ఛైత్రా రాయ్ కూడా ఖరీదైన వస్తువులు, కార్లు వాడడం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఆమె కూడా దాదాపు 60 లక్షలకు తగ్గకుండా ఉన్న కారును వాడుతోందట. ఆ తర్వాత లిస్ట్‌లో చూసుకుంటే మరొక సీరియల్ ఆర్టిస్ట్ విష్ణు ప్రియ కూడా 15లక్షల విలువైన కారును ఉపయోగిస్తోందట. వీరితో పాటు భావన, మధుమిత, అనుశ్రీ లు కూడా 20 లక్షలు ఖరీదైన కారును వాడుతున్నట్లు సమాచారం.