చైనాలో ఉద్భవించిన కరోనా భారత దేశంలో వ్యాపించి తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పటికీ కొత్త కొత్త వేరియంట్లతో ప్రజల పై దాడి చేస్తోంది. కరోనా వ్యాప్తితో ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి ప్రజలలో కరోనా భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో మరో కొత్త వ్యాది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో మంకీపాక్స్ కేసు నమోదైంది. తాజాగా ఈ కేసుల సంఖ్య 3 కి చేసింది. దీంతో ప్రజలలో ప్రాణ భయం మళ్లీ మొదలైంది. కరోనా లాగా ఇదికూడా ఒకరినుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెంది ప్రాణహాని ఉందని ప్రజలు భయపడుతున్నారు.
మంకీపాక్స్ వ్యాది అనేది ఒక వైరల్ జూనోటిక్ వ్యాధి. ఇది మశూచి వ్యాధికి సమానమైన లక్షణాలతో ఉంటుంది. అయితే ఈ వ్యాధి విషయంలో ఊరటం ఇచ్చి విషయం ఏమిటంటే ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మంకీ ఫాక్స్ వ్యాధి సోకిన కూడా ప్రాణహాని ఉండదని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం సాధారణంగా 2 నుండి 4 వారాల వరకు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన జంతువులతో కానీ వ్యక్తులతో కానీ సన్నిహితంగా ఉండటం వల్ల ఈ మంకీ ఫాక్స్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అంతే కాకుండా శరీర ద్రవాలు, కలుషితమైన పదార్థాల నుండి కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి సోకినప్పుడు జ్వరం, తలనొప్పి, చలి, కండరాల నొప్పి, అలసట, వెన్నునొప్పి, వాపు శోషరస కణుపులు,అలసట, ముఖం మీద, నోటి లోపల, శరీరంలోని ఇతర భాగాలలో మొటిమలు లేదా బొబ్బలు వంటివి కనిపిస్తాయి ఇప్పటివరకు కేరళలో మూడు మంకీ ఫాక్స్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించారు. దీంతో కేరళలో ప్రజారోగ్య చర్యలను అమలు చేయడంలో రాష్ట్ర అధికారులతో సహకరించడానికి కేంద్రం ఒక ఉన్నత-స్థాయి మల్టీ-డిసిప్లినరీ బృందాన్ని కేరళకు తరలించింది. మంకీ పాక్స్ వ్యాధి వ్యాప్తి పై కేరళ రాష్ట్రంలో మొత్తం 14 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించగా, నాలుగు విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్‌లు ప్రారంభించారు.