Yashika Anand : చచ్చి బతికిన హీరోయిన్.! జీవితాంతం మర్చిపోలేని పాపం.!

Yashika Anand : యాషిక ఆనంద్.. సోషల్ మీడియా  హాట్ సెన్సేషన్. ప్లస్ సైజ్ ముద్దుగుమ్మగా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ ఈ అమ్మడు. అయితే ఓ సారి తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ, యాక్సిడెంట్ చేసింది. ఇంత మేజర్ యాక్సిడెంట్ చేసిన కారణంగా యాషికా ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాగోలా ఆ కేసు నుండి బయటపడిందనుకోండి.
అయితే,  ఈ యాక్సిడెంట్‌లో చావు తప్పి కన్ను లొట్టపోయిందన్నట్లుగా చావు నుంచి అయితే తప్పించుకుంది కానీ, తీవ్ర గాయాల పాలై చాలా నెలలు మంచానికే పరిమితమైపోయింది. లేచి నడిచే పరిస్థితి లేదని వైద్యులు తేల్చేశారు. అలాగే చాలా నెలలు అన్నీ బెడ్ పైనే. చివరికి ఎలాగైతేనేం లేచింది. తన కాళ్లపై తాను నిలబడింది.
మరో విషాదకరమైన అంశమేంటంటే, అదే యాక్సిడెంట్‌లో తన ప్రాణ స్నేహితురాల్ని కోల్పోయింది. కళ్ల ముందే, ప్రాణ స్నేహితురాల్ని కోల్పోయిందన్న బాధ యాషికా  ఆనంద్‌ని జీవితాంతం వెంటాడుతూనే వుంటుంది. తప్పు చేసిందా.? లేదా.? అనే విషయం పక్కన పెడితే, నో డౌట్.. ఆ పాపం మాత్రం యాషికాని వెంటాడుతూనే వుంటుంది జీవితాంతం.
యాషిక స్నేహితురాలు వెలిచెట్టి పావని. ఆమె మన తెలుగమ్మాయే.! ప్రమాదం నుంచి బయట పడ్డా తాను జీవచ్ఛవంతో సమానమనీ, తన స్నేహితురాలి మరణానికి తానే కారణమయ్యానన్న వేదన తనను కలచివేస్తోందనీ చెబుతుంటుంది యాషిక ఆనంద్.  టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ సినిమాలో యాషిక ఓ చిన్న పాత్రలో కనిపించింది.