నిర్మాత, వైకాపా నేత పీవీపీ అగ్రహంతో ఊగిపోయారు. బంజారా హిల్స్ లో ని పీవీపీ ఇంటిపక్కనే నిర్మాణం చేపడుతోన్న ఓనర్ ని బెదించారు. దెబ్బకి ఆ ఇంటి ఓనర్ బెదిరిపోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. అసలేం జరిగిందంటే? బజారాహిల్స్ లోని పీవీపీ ఇంటిపక్కనే ఉన్న మరో ఇంటి ఓనర్ ఇంటి ఎలివేషన్ పనులు మొదలుపెట్టాడు. అలా చేస్తే తన ఇల్లు దెబ్బ తింటుందని, నిర్మాణం ఆపాలని పీవీపీ హెచ్చరించాడు. అయినా ఆ ఇంటి ఓనర్ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పీవీపీ ఏకంగా గుండాలను రంగంలోకి దింపారు. దాదాపు 40 మంది గుండాలు సీన్ లోకి ఎంటరై ఆ ఇంటి ఓనర్ ని బెదిరించే ప్రయత్నం చేసారు.
అంతటితో ఆగకుండా ఆ ఇంటిని కూల్చే ప్రయత్నం చేసారుట. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి స్పాట్ కి చేరుకుని పీవీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పీవీపీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇలాంటి వివాదం పీవీపీ కి కొత్తేం కాదు. గతంలోనూ ఆయనపై కొన్ని బెదిరింపు కేసులున్నాయి. ఓ వ్యక్తిని తీవ్రంగా దూషించి..బెదిరిచినట్లు అప్పట్లో ఆరోపణలొ చ్చాయి. మరి తాజా వివాదంలో అసలు తప్పు ఎవరదన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం పీవీపీ వైకాపా పార్టీలో కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్ లో నిర్మాతగాను బిజీగా ఉన్నారు. డిఫరెంట్ జోనర్ సినిమాలు నిర్మించడం పీవీపీ ప్రత్యేకత.