వచ్చేస్తోందనే వార్త బయటకు పొక్కేసరికే కొత్త వేరియంట్ విస్తరించేయడం గతంలోనూ చూశాం. డెల్టా వేరియంగ్ ప్రపంచాన్ని భయపెట్టింది.. దాన్ని సెకెండ్ వేవ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒమిక్రాన్.. ఇది మూడో వేవ్‌కి కారణమయ్యే అవకాశాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.
ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి గనుక, ప్రపంచ దేశాలు ఒకటొకటిగా అప్రమత్తమవడం ప్రారంభించాయట. అయితే, నమోదైన కేసుల్లో ఎన్నిటిని అసలైన ఒమిక్రాన్ కేసులుగా గుర్తించారు.? ఇంకా గుర్తించని కేసులెన్ని వున్నాయి.? అన్నదానిపై భిన్న వాదనలు తెరపైకొస్తున్నాయి.
ప్రపంచంలో ఎక్కడ ఏ మూల కొత్త వేరియంట్ వచ్చినా, అది గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేయడం ఇటీవలి కాలంలో చాలా తేలికైపోయింది. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల ఏయే దేశాలకు జనం వెళ్ళి వచ్చారు, వారెవరైనా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమయ్యారా.? అని ఆరా తీసేలోపు, ఆయా దేశాల్లో ఒమిక్రాన్ విజృంభించేయడం ఖాయం.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష కోవిడ్ 19 ఒమిక్రాన్‌పై జరిగిందట. రాష్ట్రాలు అప్పమత్తంగా వుండాలని కేంద్రం సూచిస్తోంది. మరి, ఇప్పటికే దేశంలోకి ఒమిక్రాన్ వచ్చేసి వుంటే.? ఆ ఊహే జనాన్ని భయకంపితుల్ని చేస్తుంది.
చలికాలం, దానికి తోడు భారీ వర్షాలు, వరదలు.. వీటన్నిటికీ తోడు.. జనం స్వేచ్చగా, నిర్భయంగా.. అస్సలేమాత్రం మొహమాటం లేకుండా తిరిగేస్తున్నారు. సో, దేశంలో మూడో ముప్పు షురూ అయినట్లే. మరి, లాక్ డౌన్ మాటేమిటి.? సెకెండ్ వేవ్ సమయంలోనే లాక్ డౌన్ లేదు.. ఇప్పుడు వుంటుందని ఎలా అనుకోగలం.?