Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టులో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఈయన హుటాహుటిన కాకినాడ పోర్టుకు వెళ్లారు ఇలా కోర్టులో ఈయన తనిఖీలు నిర్వహించడమే కాకుండా అక్రమంగా రవాణా చేస్తున్న షిప్పుని కూడా సీజ్ విషయం మనకు తెలిసిందే.. అయితే పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అని చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సంచలనగా మారింది.
ఇకపోతే ఆ షిప్ ను కలెక్టర్ రెండు రోజుల క్రితమే సీజ్ చేశారని అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానీని సీజ్ చేయమని చెప్పడంతో కొంతమంది విమర్శలు చేయగా మరి కొంతమంది అధికారులు సీజ్ చేసింది రైస్ ని మాత్రమే కానీ పవన్ మాత్రం షిప్పుని కూడా సీజ్ చేశారు అంటూ చెప్పుకోవస్తున్నారు అయితే మరి కొంత మంది పవన్ కళ్యాణ్ కు అసలు ఈ షిప్పులను సీజ్ చేసే అధికారం కూడా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి నిజానికి పవన్ కళ్యాణ్ కు అలాంటి అధికారాలు ఉండవా మరి ఆ అధికారం ఎవరికి ఉంటుంది అనే విషయానికి వస్తే…
కాకినాడ పోర్టులో సౌతాఫ్రికాకు చెందిన స్టెల్లా ఎల్ 1 నౌకలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారనే కారణంతో దాన్ని సీజ్ చేయాలని అయితే సముద్ర రవాణా ప్రభుత్వ పరిధిలోకి రాదు. అందులో స్మగ్లింగ్ జరిగితేనే దాన్ని సీజ్ చేసే అధికారం మాత్రమే ప్రభుత్వ అధికారులకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ పట్టుకున్న రేషన్ బియ్యం రవాణా స్మగ్లింగ్ కిందకు రాదని అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సీజ్ చెల్లదని అధికారులు చెబుతున్నారు.కాకినాడ పోర్టు యాజమాన్యం.. చివరికి నో డ్యూ సర్టిపికెట్ ఇవ్వకుండా ప్రస్తుతానికి దాన్ని అడ్డుకుంది. అయితే ప్రత్యామ్నాయ చర్యల విషయంలో ప్రభుత్వం అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.సముద్రంలో తలెత్తే వివాదాలకు సంబంధించిన కేసుల్ని పరిష్కరించేందుకు చట్టంలోని సెక్షన్ 2(1)(ఇ) ప్రకారం ఈ అడ్మిరాలిటీ కోర్టును ఏర్పాటు చేస్తారు.