Omicron: ఒమిక్రాన్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన వైద్యులు

Omicron: కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్ ను కూడా కలవరపెడుతుంది. దేశం వ్యాప్తంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా 422కు చేరుకుంది. అందులో 130 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో నాలుగో రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమవుతుండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరించిన సంగతి తెల్సిందే.

ఒమిక్రాన్ ఇంతలా ప్రజలను భయపెడుతున్న పెద్దగా లక్షణాలు చూపించడం లేదు. ఒమిక్రాన్ బాధితుల్లో మందికి కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని.. త్వరలోనే కోలుకుంటున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఒమిక్రాన్ ప్రాణాంతకం అంటూ భయపడేవారికి గుడ్ న్యూస్ చెప్పారు ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రి వైద్యులు.

ఇప్పటి వరకు ఒమిక్రాన్ బాధితులకు కేవలం మల్టీ విటమిన్లు, పారాసెటమల్ ట్యాబ్లెట్ల ద్వారానే చికిత్స అందించామని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. చాలా మంది ఔషధాలు వాడకుండానే కోలుకుంటున్నారని కూడా తెలిపారు. ఆస్పత్రిలో ఇప్పటి వరకు 51 మంది ఒమిక్రాన్ బాధితులు చేరితే.. 40 మంది ఒమిక్రాన్ ను జయించి డిశ్చార్జ్ అయ్యారని వైద్య బృందం తెలిపింది. ఇప్పటి వరకు ఎవరికి ఆక్సిజన్ సపోర్ట్, స్టెరాయిడ్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్ల అవసరమే రాలేదని చెప్పారు వైద్యులు.