Omicron cases in Tamilnadu: దేశంలో ఒకవైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న వేళ.. మరోవైపు ఒమిక్రాన్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల నమోదు పెరుగుతూ టెన్షన్ పెట్టిస్తుంది. తాజాగా తమిళనాడులో విదేశాల నుంచి వచ్చిన వారిలో భారీగా ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీనితో సుమారు 82 మందికి శాంపిల్స్ ను వైద్య పరీక్షల నిమిత్తం బెంగుళూరు ల్యాబ్ కు పంపించారు. వాటికి సంబంధించిన ఫలితాలను ఎదురు చూస్తున్నారు వైద్య బృందము.
ఇప్పటికే నైజీరియా నుంచి వచ్చిన రోగి ఒమిక్రాన్ నుండి కోలుకుంటున్నాడు. అయితే ఇప్పుడు పంపించిన శాంపిల్స్ లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉండడంతో వారిని కింగ్స్ ఆసుపత్రిలో ఉంచి వైద్యులు పరివేక్షిస్తున్నారు. బెంగుళూరు నుంచి శాంపిల్స్ ఈరోజు వచ్చే అవకాశముందని వైద్య సిబ్బంది చెప్పారు. బుధవారం టాంజానియా నుంచి వచ్చిన యువకుడిలోనూ ఒమిక్రాన్ ఛాయలు వెలుగు చూశాయి. ఇక, కెన్యా నుంచి చెన్నై మీదుగా తిరుపతి వెళ్లిన ఓ 39 ఏళ్ళ మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. అక్కడ వైద్య సిబ్బంది అప్రత్తమయ్యింది.
ఇక తమిళనాడు సర్కార్ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించేలా సరిహద్దుల్లోని వైద్య బృందాలను స్టాలిన్ సర్కార్ నియమించింది. జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ మరోసారి హెచ్చరించారు.