తెలుగు దేశం పార్టీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న మొద్దు శ్రీను హత్యకు గురైన సంగతి తెలిసిందే. 2008 నవంబర్ 9న జైలులో శిక్ష అనుభవిస్తున్న మొద్దు శ్రీనుని ఓం ప్రకాష్ డంబెల్ తో కొట్టి చంపాడు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. వరుస హత్య లతో సీమ రాజకీయాలు మండిపోయాయి. నాటి కాంగ్రెస్-టీడీపీ నాయకుల మధ్య వివాదమే ఇంత ఉపద్రవానికి దారి తీసింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా ఓం ప్రకాష్ ఉన్నాడు. అప్పట్లో అనంతపురం పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకాష్ కి ఈ కేసులో జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో వేర్వేరు జైళ్లలో శిక్ష అనుభవించాడు.
దీంతో అనారోగ్యానికి గురయ్యాడు. నెల్లూరు నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరుచూ తీసుకువెళ్లేవారు. ఇది జైళ్ల అధికారులకు భారంగా మారడంతో చివరిగా 2016 లో విశాఖపట్టణంలోని అరిలోవ కేంద్రకారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ ఆరోగ్యం విషమించి సోమవారం మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి శ్వాస సంబంధిత సమస్యతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జైలు సూపరిండెంట్ రాహుల్ తెలిపారు. ప్రకాష్ మూత్రపిండాలు చెడిపోవడంతో డయాలసిస్ చేసామని అయినా లాభం లేకపోయిందని తెలిపారు.
దీంతో ఓం ప్రకాష్ కథ సుఖాంతమైంది. ఓం ప్రకాష్ తల్లి సరోజనమ్మ కూడా అనారోగ్యంతో గత ఏప్రిల్ చనిపోయారు. కొడుకు హత్య చేయడం..ఆ కేసులో జీవిత ఖైదు పడటంతో తల్లి మానసికంగా ఎంతో కృంగిపోయారు. తల్లి ఉన్నంత కాలం కుమారుడిని చూసుకోవడానికి వెళ్లేది. కానీ ఆమె మరణం తర్వాత ప్రకాష్ మానసికంగా కృగిపోయాడు. హత్య కేసు లో జీవిత ఖైదు..తల్లి లేదన్న బాధతో మనో వేదనకు నిత్యం గురయ్యేవాడని తెలుస్తోంది. దీంతో సీమ ఫ్యాక్షన్ కథ సుఖాంతమైంది. పరిటాల రవిని మొద్దు శ్రీను చంపడం…ఆ వెంటనే ఓం ప్రకాష్ మొద్దు శ్రీను కర్కశంగా జైల్లో డంబెల్ తో కొట్టి చంపడం అప్పట్లో ఓ సంచలనం.