ఆ గొడవలు కారణంగానే పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించారా… అసలు విషయం ఏమిటంటే?

రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా ఈయన ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల పరంగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రెటీల గురించి తరచూ ఏదో ఒక వార్తలు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వైరల్ అవుతూ ఉంటాయి. ఇకపోతే గతంలో పవన్ కళ్యాణ్ పరిటాల రవితో గొడవకు దిగారని ఆ విషయంలోనే పరిటాల రవి తనకు గుండు కొట్టించారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక ఈ విషయం గురించి వైసిపి మంత్రులు బహిరంగంగా ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకోవచ్చారు.చిరంజీవికి పరిటాల రవికి ఒక భూమి సమస్య కారణంగా గొడవ చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఆ గొడవ మధ్యలోకి వెళ్లి పెద్ద ఎత్తున సంచలనం సృష్టించారని దాంతోనే పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారంటూ వార్తలు వచ్చాయి.అయితే గుండు విషయం పూర్తిగా నిజం కాదని ఇది కేవలం ఆ వాస్తవం అంటూ అప్పట్లో ఈ వార్తలను కొట్టి పారేశారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారనే వార్త మీడియాలో కూడా ఇక్కడ వినిపించ లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే పరిటాల రవి బ్రతికున్న సమయంలోనే ఈ విషయం గురించి మాట్లాడుతూ సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటి విషయాల గురించి వార్తలు రావడం సర్వసాధారణం పవన్ కళ్యాణ్ కొట్టించినటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారని పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.