ఏపీలో రాజకీయాలన్నీ ప్రస్తుతం దేవాలయాల చుట్టే తిరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అంతర్వేదిలో రథం దగ్ధం అవడంతో పాటుగా… విజయవాడ కనకదుర్గమ్మ రథానికి ఉన్న వెండి సింహాలు కూడా మాయం అవడం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
ఈ ఘటనలు అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు నారా లోకేశ్ దగ్గరకు చేరుకున్నాయి. అంతే కాదు.. గతంలో కనకదుర్గమ్మ గుడిలో జరిగిన క్షుద్ర పూజలు నారా లోకేశ్ కోసమేనని తెలుస్తోంది. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసమే దుర్గ గుడిలో పూజలు జరిగినట్టుగా తెలుస్తోంది.
అయితే.. తాజాగా వెండి సింహాలు మాయం అయిన విషయం వెలుగులోకి రావడంతో… దీనిపై కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ సోమినాయుడు ఏమంటున్నారంటే.. కనకదుర్గమ్మ వారి రథాన్ని చివరిసారిగా టీడీపీ హయాంలోనే ఉపయోగించారు. అప్పటి నుంచి ఆ రథానికి ముసుగే ఉండటంతో… వెండి సింహాల గురించి ఎవ్వరికీ తెలియలేదు.. అని వ్యాఖ్యానించారు.
అంటే.. వెండి సింహాలు అప్పట్లోనే మాయం అయ్యాయనే విషయం ఇక్కడ స్పష్టమవుతున్నా… అప్పటి నుంచి అవి లేవనే విషయం కూడా ఎవ్వరికీ తెలియలేదు.
అయితే.. ఆ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి అనే విషయంపై మాత్రం ప్రస్తుతం క్లారిటీ లేదు. కాకపోతే చివరగా దుర్గగుడిలో క్షుద్ర పూజలు జరిగిన మాట మాత్రం వాస్తవమేనని సోమినాయుడు వెల్లడించారు.
అయితే.. కనకదుర్గ గుడిలో జరిగిన క్షుద్ర పూజలు నారా లోకేశ్ కోసమేనని.. తన తల్లి భువనేశ్వరే అప్పటి ఈవోతో మాట్లాడి అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలను నిర్వహించారని ఆయన తెలిపారు.
క్షుద్ర పూజల సమయంలో ఆలయంలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటికి వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హయాంలోనే క్షుద్ర పూజలు జరిగినట్టు అప్పట్లోనూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించినా.. టీడీపీ ప్రభుత్వం దాన్ని తొక్కేసింది. సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఆలయంలో బైరవీ పూజ చేసినట్టుగా ఒప్పుకున్నారు కానీ.. ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తు మధ్యలోనే ఆగిపోయిందని ఆయన తెలిపారు.
అమ్మవారి ఆలయంలోని వెండి సింహాల మాయం కాస్త లోకేశ్ బాబు క్షుద్ర పూజల దగ్గరకు చేరుకుంది. మరి.. దీనిపై కనీసం ఇప్పటికైనా హిందుత్వవాదులు స్పందిస్తారా? ఒక పవిత్రమైన గుడిలో ఇలాంటి క్షుద్ర పూజలు చేయడం దేనికి నిదర్శనం. దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో చూద్దాం.