స్టార్ డైరక్టర్ చేసిన పనికి అప్ సెట్ అయిన ఎన్టీఆర్ ఫాన్స్…?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా లెవెల్ లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివతో తన తదుపరి చిత్రం ప్రకటించాడు. ఎన్టీఆర్ 30 పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ మోషన్ టీజర్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ తో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే షూటింగ్ మొదలు కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది . ముఖ్యంగా ఇటీవల కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తన సినిమా గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 సినిమా స్క్రిప్ట్ రీ రైట్ చేయటానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేలా ఉంది. అంతా బాగుంటే జూలై మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే వారు. కానీ స్క్రిప్ట్ పరంగానూ.. మంచి ముహూర్తం కోసం తనకు మరో రెండు నెలల సమయం కావాలని కొరటాల ఎన్టీఆర్ ని అడగడం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ లో ఎలాంటి లోపాలు లేకుండా పర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్ళటానికి ఎన్టీఆర్ కూడా వెయిట్ చేస్తున్నాడు.

అయితే సినిమా షూటింగ్ ప్రతిసారీ ఇలా వాయిదా పడటంతో ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడు సంవత్సరాలు ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో అయినా తొందరగా ప్రేక్షకుల ముందుకు వస్తారు అనుకుంటే ఈ సినిమా కూడా ఆలస్యం అయ్యేలా ఉందని ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కుతుందా? లేదా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాజమౌళితో సినిమా తీసిన ఏ హీరో అయినా ఆ సినిమా తర్వాత ఖచ్చితంగా ప్లాప్ అందుకుంటాడు అనే సెంటిమెంట్ కూడ ఎన్టీఆర్ అభిమానులని కలవర పెడుతోంది.