Ntr: ఓయమ్మా …ఎన్టీఆర్ కట్టిన ఈ వాచ్ ఖరీదు అన్ని కోట్ల… సిటీలో విల్లా కొనొచ్చు కదా సామి?

Ntr: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు చాలా లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉంటారు వారు సంపాదించేది మొత్తం వారి విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. వారు వేసుకునే చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలుకొని తిరిగే కార్లు ఉండే బంగ్లాలు కూడా కోట్లు విలువ చేస్తూ ఉంటాయి. ఇక ఇలా లగ్జరీ బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు.

ఎన్టీఆర్ కి వాచ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. ఈయన ఎక్కడికి వెళ్లినా వివిధ రకాల బ్రాండెడ్ చేతి వాచ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ వాచ్ ఖరీదు కూడా కొన్ని కోట్లలో ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ వద్ద పలు బ్రాండ్లకు సంబంధించిన ఖరీదైన చేతివాచ్ లు ఉన్నాయి. అయితే ఇటీవల ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ కోసం ముంబై ఎయిర్ పోర్టులో దిగినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఇలా ఎన్టీఆర్ ను ఈ లుక్ లో చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఎన్టీఆర్ చేతికి ధరించిన వాచ్ సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఆ వాచ్ ఏ బ్రాండ్ కు చెందినది దాని ధర ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక ఎన్టీఆర్ ధరించిన ఈ స్టైలిష్ వాచ్ రీఛార్జ్ 40 – 01 టర్బైన్ మెకలర్.. స్పీడ్ టైల్‌ బ్రాండ్ కు చెందినది. ఈ వాచ్ విదేశాల నుండి ఎక్స్ ప్లోడ్ చేశారు. అన్ని పన్నులు చెల్లించిన తర్వాత.. దాదాపు రూ.8 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సమాచారం. ఈ వాచ్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 106 మోడల్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఖరీదైన రేర్ వాచ్ లో ఎన్టీఆర్ వద్ద ఒకటి ఉంది.

ఇలా ఎన్టీఆర్ దగ్గర ఉన్నటువంటి ఈ స్టైలిష్ వాచ్ ఖరీదు ఎనిమిది కోట్లు అని తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఓయమ్మ ఒక్క వాచ్ ఖరీదు ఇన్ని కోట్ల ఈ డబ్బుతో సిటీలో విలాసవంతమైన ఒక విల్లా కొనుగోలు చేయొచ్చు కదా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే సెలబ్రిటీలు ఇలాంటి బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం.