వారి తోలు తీయడానికి సిద్దమైన ఏపీ సీయం వైఎస్ జగన్.. ఇక అలాంటి నాటకాలు చెల్లవట.. ?

cm jagan mohan reddy telugu rajyam

 

లోకంలో మోసపోయేవాడు ఉంటే మోసం చేసే వారు చీమల్లా పుట్టుకొస్తుంటారు.. ప్రస్తుతం ఇలాంటి పనులే సమాజంలో జరుగుతున్నాయి.. ఇందులో ఎక్కువగా మధ్యతరగతి వారే ఉంటారు.. ఏదో చిన్న లాభం కలుగుతుందనుకుంటే పులిని కూడా నమ్మేసి దాని మీద సవారి చేస్తా అంటాడు మధ్యతరగతి మనిషి.. ఇక ఈ మధ్య కాలంలో జరిగే మోసాల్లో దళారులు లాభపడి, ప్రజలు నష్టపోయేది ఎందులో అంటే భూముల విషయాల్లో.. ఏది కొన్న, దేనిలో పెట్టుబడి పెట్టినా అనుకున్నంత లాభం ఉండదు.. అదే పెట్టుబడి భూముల విషయంలో పెడితే భవిష్యత్తులో అయినా దాని రేటు పెరుగుతుందనే ఆశ..

వీరి ఆశను అనువుగా మార్చుకున్న దళారులు అనధికార లే అవుట్లలో ప్లాట్లు తయారుచేసి అమాయక ప్రజలకు అంటగడుతున్నారు.. వీటిని కొనుగోలు చేస్తున్న వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు చేస్తున్నవారిపై కొరడా ఝుళిపించడానికి సిద్దమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి ఫీజు చెల్లించకుండా, అసలు అనుమతులు తీసుకోకుండా అక్రమ లే అవుట్ వేస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకుంది.. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖా మంత్రి బొత్సా సత్యాన్నారాయణ, పంచాయతీరాజ్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో, అక్రమ లే అవుట్లపై సర్వే చేసి, అనధికార లే అవుట్లకు నోటీసులు జారీ చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

ఇక ఇలాంటి అక్రమ లే అవుట్లు విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, తిరుపతి వంటి పెద్ద నగరాలకు సమీపంలోనే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.. అంటే ఇప్పటి నుండి అక్రమంగా ప్లాట్లు విక్రయించే వారి తోలు తీయడానికి ఏపీ సీయం సిద్దం అయ్యారన్న మాట.. మరి ఇన్నాళ్ల నుండి వారు వేస్తున్న నాటకాలు ఇక చెల్లవన్న మాట.. అదీగాక పట్టణ ప్రాంతాల్లోలా గ్రామ పంచాయితీల్లో కూడా అక్రమ లే అవుట్ ల రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకురావటానికి కూడా చర్చ జరిగిందట.. ఇది మరి మంచిది.. దీనివల్ల మోసాలు చేసే అవకాశం ఉండదు.. కాబట్తి భూముల మీద పెట్టుబడి భయం లేకుండా పెట్టుకోవచ్చని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన ఏపీ ప్రజలు..