Health Benifits: సాధారణంగా పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. ఒక్కో రకమైన పనులు వివిధ రకాల పోషక విలువలు కలిగి ఉంటాయి. పండ్లు తినడానికి ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యం ఎంతో మేలు చేస్తాయి. సీతాఫలం కూడా ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. చిన్న పిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా అందరూ ఈ పండుని ఇష్టంగా తింటుంటారు. సీతాఫలం ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. సీతాఫలం పండు మాత్రమే కాకుండా సీతాఫలం చెట్టు ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సీతాఫలం ఆకుల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
సీతాఫలం ఆకులు షుగర్ వ్యాధిని అదుపు చేయడంలో చాలా బాగా పని చేస్తాయి. సీతాఫలం ఆకులు నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడపోసి గోరువెచ్చనీ నీటిని తాగటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి సీతాఫలం పొడిగించడం లేదు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.
సీతాఫలం ఆకులు మరిగించిన నీటిని ప్రతిరోజు ఒక గ్లాస్ తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా దగ్గు, జలుబు ,జ్వరం వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
సీతాఫలం ఆకులలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి. సీతాఫలం ఆకులలో కాపర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, అతిసారం వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. సీతాఫలం చెట్టు ఆకులు, గింజలు, బెరడు ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు.