Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్స్ చేసేవారికి, తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అంతే కాకుండా తన అస్థిత్వాన్ని, గుర్తింపు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అలాంటి వారికి వెంటనే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రియాంక తన రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ది మ్యాట్రిక్స్. ఈ సినిమా రిసరెక్షన్స్ ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది. ది మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీ నుంచి 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా సీత పాత్రలో నటించింది. ఖైదీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎమ్మి అవార్డుకు నామినేట్ అయిన టెలివిజన్ హోస్ట్ రాషా గోయల్ తో ముచ్చటించింది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే ప్రియాంక తన మూలాలను గుర్తు చేసుకుంది. తాను ఎప్పుడూ ఇంటికి (ఇండియా) దూరంగా ఉన్నట్లు భావించలేదని, అలాగే మీరు నన్ను భారతదేశం నుంచి బయటకు తీసుకు రావచ్చు కానీ భారతదేశాన్ని నా నుంచి వేరు చేయలేరు. నేను ఎక్కడికి వెళ్లినా నాతోపాటు నా సంస్కృతి కూడా వస్తుంది.. అందుకే నేను ఎప్పుడు ఇండియాకు దూరంగా ఉన్నట్లు భావించలేదు అని తెలిపింది.
నా ఇల్లు,నా మందిరం, మా అమ్మ, నా ఆచారాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ నాతోనే ఉంటాయి అని తెలిపింది. కాబట్టి నేను బాగానే ఉన్నాను.. ఈ విధంగా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. ప్రియాంక అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈమె అమెరికాలోనే నివసిస్తోంది. ఇప్పుడు ఇది చాలా వ్యూహాత్మకంగా ఉందని ప్రియాంక భావిస్తున్నట్టు తెలిపింది. ఇకపోతే తాను హాలీవుడ్, బాలీవుడ్ లో బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఎందుకంటే ఆ విధంగా నటిస్తూ బ్యాలెన్స్ చేయగలిగే నటులు ప్రపంచవ్యాప్తంగా అది కొంత మంది మాత్రమే ఉంటారని ప్రియాంక అభిప్రాయపడింది.