చిరు వెనకడుగు వేసినట్టే

Acharya may postpone to June

Acharya may postpone to June

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’ పూర్తయ్యే దశలో ఉంది. ముందుగా సినిమాను మే 13న విడుదలచేయాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ శరవేగంగా జరిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా సెకండ్ వేవ్ గట్టిగా వీస్తోంది. కేసులు పెరుగుతున్నాయి. రేపో మాపో ప్రభుత్వం సినిమా థియేటర్ల మీద ఆంక్షలు విధించవచ్చు. 100 శాతం ఆక్యుపెన్సీని 50 శాతానికి కుదించవచ్చు. మరీ కష్టంగా ఉంటే థియేటర్లు మూసివేయవచ్చు కూడ.

50 శాతం ఆక్యుపెన్సీ అనేది చిన్న సినిమాలకు వర్కవుట్ అవుతుందేమో కానీ పెద్ద సినిమాలకు భారీ నష్టాలను మిగులుస్తుంది. అలాగని ఓటీటీలకు వెళ్తారా అంటే లేదు. పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోనే రావాలి. లేకుంటే అభిమానులు ఒప్పుకోరు. అందుకే ఈ గొడవలన్నీ ఎందుకని సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఆ జాబితాలో మొదటగా ‘ఆచార్య’ ఉంది. కరోనా కష్టాల్లో సినిమాను రిలీజ్ చేసి నష్టాలను కొని తెచ్చుకోవడం ఎందుకని అనుకున్న మెగా టీమ్ తాపీగా జూన్ నెలలో రిలీజ్ పెట్టుకుంటే పోతుందని, అప్పటికి కరోనా కేసులు తగ్గి ఎలాంటి ఆటంకాలు ఉండవని యోచిస్తున్నారట.