Prabhas: మనిషిగా పక్కోడికి పది రూపాయలు చేయాల్సింది వంద రూపాయలు దానం చేసి, రాయల్‌గా నేను ఒకడిని ఉన్నానురా అనేటటువంటి వ్యక్తి రెబల్ స్టార్ ప్రభాస్ అని సినీ నటుడు శివాజీ రాజా అన్నారు. తాను, వి.వి. వినాయక్ కలిసి కూర్చొని ఒక గంట మాట్లాడుకుంటే అందులో అరగంట అంటే సగం వరకు ప్రభాస్ అనే పర్సన్ గురించే మాట్లాడుకుంటామని ఆయన చెప్పారు. ఎంత రాయల్‌గా ఉంటాడు ఆయన, పైగా ఎవరికైనా హెల్ప్ కావాలంటే వెంటనే చేస్తాడు అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
అది తన లైఫ్‌లోనే జరిగిందని, ఒక సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో రమ్మంటే ఎంత కావాలి చెప్పండి, కోటి రూపాయలు ఇచ్చేస్తానని ఆయన అన్నట్టు శివాజీ రాజా తెలిపారు. అలా ఎంతమంది అంటారు ఠక్కున అని ఆయన అన్నారు. ఈవెంట్‌కి వస్తానంటారు గానీ, ఆ ఈవెంట్‌కు కూడా వెళ్లక్కర్లేదు ఎందుకంత కష్ట పడతారు, నేనే ఇచ్చేస్తాను అని అంటారని ఆయన తెలిపారు.
ఇకపోతే తనకు ప్రత్యేకించి అనేం లేదు.. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ నచ్చుతారన్న శివాజీ రాజా, ఈ మధ్య మాత్రం అల్లు అర్జున్ బ్రెయిన్‌కి బాగా ఎక్కేశాడని ఆయన నవ్వుతూ చెప్పారు. ఇక తన గురించి చెప్పాలంటే కెమెరా వెనకాల నటించడం తనకు రాదని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. అవతలివాళ్లు ఫీల్ అయినా సరే పర్లేదు ఆ విషయంలో అని ఆయన చెప్పారు. ఇకపోతే తాను ఏమేమి చేయాలనుకున్నానో అన్నీ చేశానని, ఇక తనకు ఎలాంటి కోరికలూ లేవని, తను కోరుకున్న దానికంటే ఈ ప్రకృతి తనకు అన్నీ ఇచ్చిందని, దానికి కారణం ఈ ఇండస్ట్రీ అని, అందుకే ఈ ఇండస్ట్రీకి జీవితాంతం రుణపడి ఉంటానని శివాజీ రాజా తెలిపారు.