ఇన్సైడ్ టాక్ : ఎన్టీఆర్ సినిమాకి తగ్గని హీరోయిన్ కష్టాలు.. లేటెస్ట్ గా ఏమైంది అంటే.?

 No heroine for ntr : ఈ ఏడాదికి కాస్త హ్యాపీ గా ఉండే హీరో ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారు అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అనే చెప్పాలి. ఈ ఏడాదితమ హీరో చేసిన ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టడంతో ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక తన కెరీర్ లో 30 వ సినిమా అయినటువంటి కొరటాల ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయితే దీనిని భారీ స్కేల్ లో ప్లాన్ చేస్తుండగా మేకర్స్ మాత్రం హీరోయిన్ విషయం లో ఇంకా క్లారిటీ తెచ్చుకోలేకపోయారు అని లేటెస్ట్ ఇన్సైడ్ టాక్.

ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్ లు ఈ సినిమా కి నో చెప్పేసారు. దీనితో మరో హీరోయిన్ వేటలో పడ్డారు. కానీ తాజాగా మరో హీరోయిన్ ని సంప్రదించగా ఆమె కూడా సినిమాకి డేట్స్ లేవని చెయ్యడం కుదరని చెప్పిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి. మొత్తానికి అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి హీరోయిన్ దొరకట్లేదట అనే ప్రచారం బాగా జరుగుతుంది.

అయితే దీని వల్లే షూటింగ్ కూడా బాగా వాయిదా పడుతూ వస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం అయితే జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నట్టు భోగట్టా ఉంది మరి అనుకున్నట్టే జరుగుతుందో లేదో చూడాలి. అయితే ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.