కరోనాను జయించిన తైవాన్

ప్రపంచ వ్యాప్తంగా కొరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. దీంతో చాలా దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇలా ప్రపంచ దేశాలన్నీ కరోనా కారణంగా గజగజ వణికిపోతుంటే …..ఆ దేశం మాత్రం కరోనాను సమూలంగా కట్టడి చేసి రికార్డు సృష్టించింది. కరోనాను జయించి తైవాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. గత 200 రోజుల్లో తైవాన్ లో ఒక్కటంటే కనీసం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రెండున్నర కోట్ల జనాభా ఉన్నా గ కొన్ని నెలలుగా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్త పడింది ఈ చిన్న దేశం. మొదటి నుంచి తైవాన్ లో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువ…. ఇప్పటివరకు కేవలం 553 కేసులు మాత్రమే నమోదు  అయ్యాయి. వీరిలో ఏడుగురు మాత్రమే కరోనా కారణంగా చనిపోయారు.

కరోనా ప్రబలుతున్న ప్రారంభదశ నుంచి తైవాన్ చాలా జాగ్రత్తపడింది. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా మూసేసింది. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే దేశంలోకి విదేశీయులను అనుమతించింది. విదేశాల నుంచి వచ్చే వారికి తూచా తప్పకుండా 14రోజుల క్వారంటైన్ అమలు చేసింది. ఇలా ఏకంగా 3.4 లక్షల మందిని క్వారంటైన్ లో ఉంచింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించింది.

తయారీ రంగంలో ముందు వరుసలో ఉన్న తైవాన్ … వైరస్ విజృంభిస్తున్న మొదటి దశలోనే మాస్క్ ల ఎగమతిని నిలిపేసింది. దీనికి తోడు లక్షల సంఖ్యలో మాస్కులు తయారు చేయించి…. 2 కోట్లకు పెంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసింది. పక్కనే ఉన్న చైనాలో కరోనా సృష్టించిన విద్వంసాన్ని దృష్టిలో పెట్టుకొన్ని అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి త్వరగా కోలుకోగలిగింది తైవాన్.