నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత అరుదైన రికార్డు సాధించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆమెకు 10 లక్షల మంది ఫాలోవర్లు చేరారు. ఒక మిలియన్ ఫాలోవర్లు ఉండటం అనేది అంత సులభం కాదు. ఇక.. ఈ ఘటన సాధించిన తొలి సౌత్ మహిళా నేతగా ఆమె రికార్డు సృష్టించారు.
ఆమె ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. జాగృతి పేరుతో ఎన్నో సహాయ కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలోనూ కవిత ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండేవారు.
ఎవరికైనా సాయం కావాలన్నా.. ఆపదలో ఉన్నా.. ఇంకా ఏరకమైనా సాయం కావాలని కవితకు ట్వీట్ చేసినా వెంటనే స్పందించేవారు.. వారికి తగిన సాయం చేసేవారు. అందుకే.. కవితకు ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ట్విట్టర్ లో తనను తెలంగాణ నుంచే కాదు.. వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ఫాలో అవుతున్న వాళ్లు ఉన్నారు.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కవితను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. 2010లో కవిత తన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు.
ఆమె ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ పండుగలను ట్విట్టర్ ద్వారానే ప్రపంచానికి చాటారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ ఆమె ట్విట్టర్ ద్వారా తెలంగాణ డిమాండ్ ను గట్టిగా వినిపించారు.
2017లో రాఖీ పండుగ సమయంలో… మహిళలంతా.. తమ సోదరులకు రాఖీ కట్టి… హెల్మెట్ గిఫ్ట్ గా ఇవ్వాలంటూ కవిత ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది సూపర్ సక్సెస్ అయింది. ప్రముఖులు కూడా కవిత చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసించారు.
అలా.. కవిత ట్విట్టర్ లో చాలా ఫేమస్ అయ్యారు… అరుదైన రికార్డు సాధించారు.