Bollywood: తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మాళవిక రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తోంది. కాగా 2001లో విడుదలై సూపర్ హిట్ అయిన కభీ ఖుషీ కభీ ఘమ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో ఆమె పోషించిన పూజా పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
దీని తర్వాత రింజిన్ డెంజోంగ్పాతో కలిసి స్క్వాడ్ అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే కరణ్ జోహార్ తెరకెక్కించిన K3G అనే చిత్రంలోనూ యాక్ట్ చేసింది. ఇక 2017లో వచ్చిన టాలీవుడ్ చిత్రం జయదేవ్ లో కూడా కనిపించిందీ ముద్దుగుమ్మ. అయితే కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉండగానే ప్రముఖ వ్యాపార వేత్త ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాళవిక. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
https://www.instagram.com/reel/DMZ_Kv_IXrg/?utm_source=ig_web_copy_link
గత ఏడాది బీచ్ లో వీరి పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్లి వేడుకకు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.ఇకపోతే ఈ ఏడాది మే నెలలో అభిమానులకు శుభవార్త చెప్పింది మాళవిక. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఈ అమ్మడి సీమంతం వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది మాళవిక. ఇందులో భర్త ప్రణవ్ బగ్గా తో కలిసి ఎంతో ఆనందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు చూసిన మీడియాలో వైరల్ గా మారాయి.
