తన సినిమాలు చైల్డ్ ఆర్టిస్టును డేట్స్ అడిగిన అల్లు అర్జున్… ముసలోడు అవుతావన్న చైల్డ్ ఆర్టిస్ట్?

అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి చిత్రం గంగోత్రి. ఈ సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్. ఈ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకున్న కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించింది. కావ్య నటించిన సినిమాలు అన్ని దాదాపు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇలా చైల్డ్ ఆర్టిస్టుగా అందరిని తన బుజ్జి బుజ్జి మాటలతో ఆకట్టుకున్న కావ్య ఇప్పుడు పెరిగి పెద్దది అయ్యింది. ప్రస్తుతం కావ్య తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు మసూదా చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఆలీతో సరదాగా అనే షో లో సందడి చేసింది. ఈ క్రమంలో కావ్య ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆర్టిస్టుగా తన అనుభవాలను ఆలీతో పంచుకుంది. ఈ క్రమంలో గంగోత్రి సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ గారితో జరిగిన ఒక సన్నివేశం గురించి బయట పెట్టింది. కావ్య మాట్లాడుతూ..” నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అన్ని సినిమాలలోని హీరోలు నేను పెద్దయిన తర్వాత హీరోయిన్ అవుతానని అన్నారు. ఇక గంగోత్రి సినిమా షూటింగ్ సమయంలో కూడా అల్లు అర్జున్ పెద్ద అయిన తర్వాత నువ్వు మంచి హీరోయిన్ అవుతావని చెప్పి నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నాకు డేట్స్ ఇస్తావా అని అడిగారు. అల్లు అర్జున్ ఇలా అడిగేసరికి ఆ సమయానికి ముసలోడు అయిపోతావని సమధానం చెప్పాను” అంటూ వెల్లడించింది.

అయితే తన చిన్నతనంలో అల్లు అర్జున్ అడిగిన మాట ఇప్పుడు అడిగితే తనకన్నా అదృష్టవంతురాలు ఎవరుంటారు చెప్పండి. మరి అల్లు అర్జున్ తన చిన్నప్పటి హీరోయిన్ కి అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాలి మరి. ఇక అల్లు అర్జున్ సినిమాలో విషయానికి వస్తే ఇటీవల పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప సినిమా అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకొని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం తొందరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.