ఫుల్ స్పీడు మీదున్న నితిన్.. మ‌రో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు..!

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో నితిన్ మంచి స్పీడు మీదున్నాడు. చివ‌రిగా భీష్మ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అలరించిన నితిన్ ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నితిన్ న‌టించిన చెక్ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టించారు. ప్ర‌స్తుతం మూవీకి సంబంధించి ప్రమోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

Nithin | Telugu Rajyam

ఇక నితిన్ న‌టించిన మరో చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తోన్న రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న విడుద‌ల కానుంది. ఇక హిందీ వర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన సూపర్ హిట్ మూవీ అంధాధున్‌ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు నితిన్. ప్రస్తుతం దుబాయ్’లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేస్తూ ఓ పోస్టర్‌ను విడుద‌ల చేసింది చిత్రబృందం.

నితిన్ 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో న‌భా న‌టేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక హిందీలో ట‌బు చేసిన పాత్ర‌ను రమ్య‌కృష్ణ పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇందులో నితిన్ స‌రికొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles