Tollywood: టాలీవుడ్ లో ప్రస్తుతం దాదాపుగా అందరూ హీరోలు వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే సినిమాలు తెరకెక్కుతున్నాయి కానీ రిలీజ్ డేట్ల విషయంలోనే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు మూవీ మేకర్స్. కాగా ఈనెల 12వ తేదీన విడుదల కావాల్సి ఉన్న హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. సీజీ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో తప్పని పరిస్థితుల్లో మరోసారి పోస్ట్ పోన్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ ఆ డేట్ కోసం ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారు.
ఈనెల 20వ తేదీన కుబేర సినిమా 27వ తేదీన కన్నప్ప సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు తేదీల తర్వాత అందరికన్నా జూన్ 4వ తేదీ మీద పడింది. ఎందుకంటే ఇప్పటికే పోస్ట్ పోన్ అయినా హరిహర వీరమల్లు సినిమా జూన్ 4న విడుదల అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే డేట్ కి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా చివరి దశలో ఉంది. దీంతో మూవీని వాయిదా వేసే ఆలోచనలో లేమని నిర్మాత నాగవంశీ ఇటీవల తెలిపారు.
ఒకవేళ పవన్ మూవీ డేట్ ఫిక్స్ అయితే అప్పుడు ఆలోచిస్తామని ఆయన అన్నారు. కానీ వీరమల్లు జూలై 4న కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు కనపడడం లేదు. అలా అని కింగ్డమ్ సినిమా ప్రమోషన్లు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బరిలో ఉన్న మరొక సినిమా నితిన్ తమ్ముడితో వచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ అండ్ వర్క్స్ పూర్తి అయ్యాయని తెలుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ తప్పుకుంటే నితిన్ తమ్ముడు థియేటర్స్ లో సందడి చేయాలని చూస్తున్నారట. మొత్తానికి ఇప్పుడు జూలై 4వ తేదీన పవన్, విజయ్, నితిన్ లో ఎవరు వస్తారనేది క్లారిటీ లేదు. ఈ విషయంపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప జూన్ 4వ తేదీన ఎవరు వస్తారు అన్న విషయం పై క్లారిటీ లేదు.