Tammudu Movie: మామూలుగా సినిమా విడుదలకు ముందు పెయిడ్ ప్రీమియర్ వేయాలి అంటే కాస్త ధైర్యం చేయాలని చెప్పవచ్చు. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప మూవీ మేకర్స్ ఈ పెయిడ్ ప్రీమియర్స్ వేసే సాహసం చేయరు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్ తో విడుదలకు ముందే పాజిటివ్ టాక్ ఎలా అయితే వస్తుందో, ఏ మాత్రం తేడా కొట్టినా కూడా దాని నెగిటివ్ ప్రభావం కూడా అంతే దారుణంగా ఉంటుందని చెప్పాలి. అయితే గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఎవరూ కూడా పెయిడ్ ప్రీమియర్స్ జోలికి వెళ్లడం లేదు.
కానీ ఇప్పుడు ఒక నిర్మాత ఒక సినిమా విషయంలో ఈ సాహసం చేయబోతున్నారు. అతను మరెవరో కాదు నిర్మాత దిల్ రాజు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ తమ్ముడు సినిమాకు జులై 3న పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించారు దిల్ రాజు. ఈ సినిమా జూలై 4న గ్రాండ్ గా విడుదల కానుంది. సిస్టర్ సెంటిమెంట్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందిన ఈ మూవీపై దిల్ రాజు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఈ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ఆదరణను అంచనా వేయాలని, సినిమా విజయవంతమైతే మళ్లీ టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ను రీస్టార్ట్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. కొన్ని రోజులుగా టాలీవుడ్ లో పెయిడ్ ప్రీమియర్స్ ట్రెండ్ తగ్గుముఖం పట్టింది. భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని నిరాశపరిచిన నేపథ్యంలో, నిర్మాతలు ఈ వ్యూహాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టేసారు. దిల్‌రాజు మాత్రం తమ్ముడు సినిమాతో ఈ ట్రెండ్ ను తిరిగి తెరపైకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. తమ్ముడు మూవీ సక్సెస్ అయితే దిల్‌రాజు బాటలో టాలీవుడ్ మళ్లీ పెయిడ్ ప్రీమియర్స్ వైపు వెళ్లే అవకాశం ఉంది. మరి దిల్ రాజు చేస్తున్న సాహసం ఫలిస్తుందా, పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా చూడాలి మరి.