మంచి సినిమాను ఇలా వదిలేశావేంటి నితిన్ !

Nithiin gives Maestro to OTT
Nithiin gives Maestro to OTT
 
హీరో నితిన్ గత రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. లాక్ డౌన్ తర్వాత వచ్చిన సినిమాల్లో నితిన్ సినిమాలే డిజాస్టర్ అయ్యాయి. మొదట చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన ‘చెక్’ సినిమాతో వచ్చాడు నితిన్.  మంచి అంచనాలతో సినిమా హాళ్లలోకి వచ్చిన ఈ చిత్రం నిరాశ పరిచింది.  నితిన్ ను చూసి  హక్కులు కొన్న పంపిణీదారులు దెబ్బతిన్నారు. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ‘రంగ్ దే’ సినిమాను వదిలాడు నితిన్.  వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు.  స్టార్ కాస్టింగ్ ఉండటం, టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా మీద హోప్స్ పెరిగాయి.  కానీ ఫలితం మాత్రం ‘చెక్’ కంటే దారుణంగా ఉంది.  
 
దీంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడ కుదేలయ్యారు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చినా కూడ ఆయన కొత్త చిత్రం ‘మాస్ట్రో’ పట్ల చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ‘అందాధూన్’ రీమేక్ కాబట్టి సక్సెస్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. పైగా నితిన్ ఫస్ట్ టైమ్ చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం. ఇలా చిత్రం మీద హైప్ అయితే గట్టిగానే ఉంది. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈజీగానే అయిపోయేది. నితిన్ గత సినిమాల హక్కుల్ని కొన్నవారికి ఈ చిత్రాన్ని రెకమెండ్ చేసి ఉండవచ్చు కూడ. కానీ ఓటీటీకి విక్రయించేశారు.  హాట్ స్టార్ నుండి 32 కోట్ల డీల్ రావడంతో నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ చూసుకుని అమ్మేయడం జరిగింది.  అంటే సినిమా థియేటర్లలో వచ్చే ఛాన్స్ లేదు. దీంతో ఫ్లాప్ సినిమాల్ని థియేటర్లకు వదిలి మంచి సినిమాను, హిట్ అవుతుందనే నమ్మకం ఉన్న సినిమాను ఇలా ఓటీటీకి వదిలేశావేంటి నితిన్ అంటున్నారు.