ఆచార్య ప్రొడ్యూసర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఏపీ సీఎం.. ఏకంగా రాజ్యసభ సీటు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. అధినేతగా కొనసాగుతున్న లాయర్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గురించి మనకు తెలిసిందే. ఈయన ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంత జిల్లా కావడంతో ఆయన సహాయంతో డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈ విధంగా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా పని చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరంజన్ రెడ్డి అనంతరం నిర్మాతగా మారారు. ఈ విధంగా ఒక వైపు నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు తన విధులను కూడా నిర్వర్తిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈయన ఆచార్య సినిమాకి కూడా నిర్మాతగా రామ్ చరణ్ తో కలిసి భాగస్వామ్యం అయ్యారు.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరంజన్ రెడ్డికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే నిరంజన్ రెడ్డిని ఎంపీగా రాజ్యసభకు పంపిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ఈయనకు ఎంపీ పదవి రావడంతో పలువురు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే గతంలో నిరంజన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డికి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్ తరఫున నిరంజన్ రెడ్డి కోర్టులో వాదించారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది.ఈ స్నేహబంధం కారణంగానే నిరంజన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించారని తెలుస్తోంది. మొత్తానికి లాయర్ గా, నిర్మాతగా తన జీవితంలో స్థిరపడిన నిరంజన్ రెడ్డి ఎంపీగా రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు.