సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్- జగన్ సర్కార్ మధ్య చోటు చేసుకున్న వివాదం తుది అంకానికి చేరుకుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సోమవారం ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంపై మంగళవారం గానీ, బుధవారం గానీ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. తదుపరి విచారణలు వాయిదాలు లేకుండా తీర్పునిస్తుందా? లేక హైకోర్టు తీర్పును బలపరుస్తూ నిమ్మగడ్డకు ఫేవర్ గా తీర్పు ఉంటుందా? అన్నది రెండు…మూడు రోజుల్లో తేలిపోనుంది. ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే నిమ్మగడ్డ పదవి నుంచి తప్పుకోవాల్సిందే.
వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం నిమ్మగడ్డ మారు మాట్లాడుకుండా ఉండాల్సిందే. అలా కాకుండా నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం జగన్ సర్కార్ కు మరో భంగపాటు తప్పనట్లే. ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు అంశాల్లో హైకోర్టు తీర్పుతో సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నప్పటికీ చిన్న చిన్న విషయాలు..అధికారుల తప్పిదాలు కారణంగా ప్రభుత్వానికి భగపాటు తప్పడం లేదు. తాజాగా నిమ్మగడ్డ విషయంలోనూ సుప్రీం కోర్టు తీర్పుతో ఊరట పొందాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
అయితే ఈసారి హైకోర్టులో దొర్లిన తప్పిదాలు దొర్లకుండా పక్కా ప్లానింగ్ ప్రకారం అన్ని విషయాలపైనా పలువురు సీనియర్ న్యాయవాదులను, నిపుణులను సంప్రదించి ప్రభుత్వం పిల్ వేసింది. మరి న్యాయవాదుల అనుభవం..వాదనలు..ప్రతి వాదనలు సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్నదిచూడాలి. ఈ తీర్పుపై ప్రస్తుతం తెలుగు రాష్ర్టల్లో ఉత్కంఠత నెలకొంది. ప్రభుత్వానికి-నిమ్మగడ్డకు మద్య స్థానిక ఎన్నికల నిర్వహణపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా విచక్షణాధికరంతో నిమ్మగడ్డ ఎన్నికల్ని వాయిదా వేసారు.