మాజీ సీఎస్ఈ నిమమ్మగడ్డ రమేష్ కుమార్-జగన్ సర్కార్ మాధ్య నువ్వా? నేనా? అన్న వార్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సరిగ్గా రెండున్న నెలల నుంచి ఈ వివాదం తెలుగు రాష్ర్టల్లో హాట్ టాపిక్ గా మారింది. నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా ప్రభుత్వం తప్పించినప్పటి నుంచి వివాదం తారా స్థాయికి చేరుకుంది. నిమ్మగడ్డ వివాదాన్ని అంతే సీరియస్ గా తీసుకుని వ్యాఖ్యానించడం, ప్రతిగా సర్కార్ కౌంటర్లు తెలుగు ప్రజలను హీటెక్కించాయి. హైకోర్టు నిమ్మగడ్డుకు అనుకూలంగా తీర్పునివ్వడంతో సర్కార్ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సీన్ మరింత వేడెక్కింది. తాజాగా ఈ కథ తుది అంకానికి చేరుకున్నట్లైంది.
ఇక సుప్రీంలో నిమ్మగడ్డ…జగన్ ప్రభుత్వం తాడో పేడో తేల్చుకోవడమే ఆలస్యం. తాజాగా అందుకు ముహూర్తం కూడా కుదిరింది. ఈ నెల 10 ఈ కేసు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. అంతా రాజ్యంగబద్దంగానే వివాదం తొలి నుంచి ముందుకెళ్తుంది. దీంతో ఈ వివాదంపై ఎవరిది పై చేయి అన్న దానిపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. హైకోర్టు తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా ఉండటంతో సుప్రీంలోనూ విజయం తనదేనని ధీమాగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. హైకోర్టు తీర్పు, వాదనలు ఆధారంగా సుప్రీంలో వాదనలు మొదలవుతాయి.
నిమ్మగడ్డ తరుపున వాదించే న్యాయవాదులు..ప్రభుత్వం తరుపు నుంచి వినిపించే వాదనలు ఎలా కొనసాగతాయి? అంతింమంగా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అన్నది ఇప్పుడు రెండు రాష్ర్టల ప్రజల్లో చర్చకు దారి తీస్తోంది. ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో నిమ్మగడ్డ..జగన్ సర్కార్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. హైకోర్టులో దొర్లిన తప్పులు సుప్రీంలో దొర్లకుండా ప్రభుత్వం తరుపున న్యాయవాదులు జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే జగన్ సర్కార్ ఊరట దక్కినట్లే. వ్యతిరేకంగా వచ్చినట్లు అయితే ప్రతిపక్షాల సంబురాలకు అవదులుండవ్ అన్నది అంతే నిజం.